వందల కోట్ల ఆస్తి ఉన్న బుట్టా రేణుక నిరుపేదనా?: టీడీపీ
- వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ కౌంటర్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రేణుక ఆస్తుల వివరాలు
- పాత ఇంటర్వ్యూల వీడియోలను వైరల్ చేస్తున్న నెటిజన్లు
దీనికి.. గతంలో బుట్టా రేణుక దంపతులు పాల్గొన్న ఓ టీవీ ఇంటర్వ్యూ క్లిప్ ను టీడీపీ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో స్వయంగా బుట్టా రేణుక తన వ్యాపార సంస్థల గురించి చెప్పడం కనిపిస్తోంది. హైదరాబాద్ లో మెరిడియన్ విద్యా సంస్థలతో పాటు టూవీలర్ డీలర్ షిప్ ప్రతుల్ హోండా కూడా తమదేనని పేర్కొంది. ఇంకా ఆటోమొబైల్ పరిశ్రమలు మరికొన్ని ఉన్నాయని వివరించింది. దీనిపై.. బుట్టా రేణుక నిరుపేద ఎలా అయిందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బుట్టా రేణుక ఆస్తులకు సంబంధించిన వివరాలను మరికొందరు పోస్టు చేశారు.