Butta Renuka Assets: వందల కోట్ల ఆస్తి ఉన్న బుట్టా రేణుక నిరుపేదనా?: టీడీపీ

Butta Renuka is one of the richest parliamentarians with assets of 300 crores
  • వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ కౌంటర్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రేణుక ఆస్తుల వివరాలు
  • పాత ఇంటర్వ్యూల వీడియోలను వైరల్ చేస్తున్న నెటిజన్లు
హైదరాబాద్ లో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా పేరొందిన స్కూలు.. నగరంలోనే పలు బ్రాంచీలు, హోండా టూ వీలర్ డీలర్ షిప్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వ్యాపారాలు ఉన్న బుట్టా రేణుక నిరుపేద ఎలా అవుతుందంటూ టీడీపీ నేతలు జగన్ పై మండిపడుతున్నారు. సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన జగన్.. తన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ బుట్టా రేణుకను జనాలకు పరిచయం చేస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ పోస్ట్ చేసింది. వీడియోలోని సీఎం జగన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇస్తూ.. ‘లక్షల కోట్లతో దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్ కు, వందల కోట్ల విలువైన ఆస్తులు, వ్యాపారాలు ఉన్న బుట్టా రేణుక నిరుపేదలా కనిపిస్తోందట.. ఎంత బుట్టలో వేసుకోవాలని అనుకున్నా కూడా ప్రజలు ఈసారి మీ బుట్టలో పడరు’ అంటూ ట్వీట్ చేసింది.

దీనికి..  గతంలో బుట్టా రేణుక దంపతులు పాల్గొన్న ఓ టీవీ ఇంటర్వ్యూ క్లిప్ ను టీడీపీ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో స్వయంగా బుట్టా రేణుక తన వ్యాపార సంస్థల గురించి చెప్పడం కనిపిస్తోంది. హైదరాబాద్ లో మెరిడియన్ విద్యా సంస్థలతో పాటు టూవీలర్ డీలర్ షిప్ ప్రతుల్ హోండా కూడా తమదేనని పేర్కొంది. ఇంకా ఆటోమొబైల్ పరిశ్రమలు మరికొన్ని ఉన్నాయని వివరించింది. దీనిపై.. బుట్టా రేణుక నిరుపేద ఎలా అయిందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బుట్టా రేణుక ఆస్తులకు సంబంధించిన వివరాలను మరికొందరు పోస్టు చేశారు.

Butta Renuka Assets
YS Jagan
Siddam
Renuka Contravercy
Richest Politician
AP Politics

More Telugu News