Sajjala Ramakrishna Reddy: బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లకే చంద్రబాబు టికెట్లు ఇప్పించుకున్నారు: సజ్జల

Sajjala reacts on BJP lists of Assembly and Lok Sabha poll candidates
  • లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
  • బీజేపీ, జనసేన జాబితాలను చంద్రబాబు టీడీపీ వాళ్లతో నింపేశాడన్న సజ్జల
  • మూడు కోట్లు ఇస్తే సీటు మార్చుతారంటూ ఓ ఆడియో బయటికి వచ్చిందని వెల్లడి
ఏపీలో పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్లకే చంద్రబాబు టికెట్లు ఇప్పించుకున్నారని, బీజేపీలో ఉన్నది టీడీపీ ఏజెంట్లేనని ఈ మేరకు కథనాలు వస్తున్నాయని అన్నారు. ఆ జాబితాలో ఉన్న పేర్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోందని విమర్శించారు. 

మూడు కోట్లు ఇస్తే సీటు కూడా మార్చుతామని ఓ ఆఫర్ ఇచ్చినట్టు ఆడియో కూడా బయటికి వచ్చిందని సజ్జల వెల్లడించారు. అటు, జనసేన పార్టీ జాబితానూ చంద్రబాబు తన మనుషులతోనే నింపేశారని తెలిపారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న నాటకం అని సజ్జల విమర్శించారు. 

చంద్రబాబు రూ.4 వేల పెన్షన్ అంటే ఎవరూ నమ్మబోరని, చంద్రబాబు ఒక నకిలీ నోటు వంటి వాడని, నకిలీ నోటును ఎవరు తీసుకుంటారు? అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవి ఏవీ జరగవని, పైగా జగన్ ఇస్తున్నవి కూడా ఆపేస్తాడని ప్రజలకు బాగా తెలుసని అన్నారు. చంద్రబాబు వస్తే నాలుగు వేల పెన్షన్ దేవుడెరుగు... ఇప్పుడు తీసుకుంటున్న మూడు వేలు కూడా ఎగిరిపోతాయని వ్యాఖ్యానించారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
YSRCP
BJP
TDP
Janasena

More Telugu News