Sunrisers hyderabad: టీ20 ఫార్మాట్‌లో సన్‌రైజర్స్ సాధించిన 277 స్కోరు అత్యధికం కాదు.. టాప్ స్కోర్ల జాబితా ఇదే!

Sunrisers hyderabads 277 is not the Highest Score In T20 Format
  • మంగోలియాపై ఏకంగా 314 స్కోరు చేసిన నేపాల్
  • 2019లో ఐర్లాండ్‌పై 278 పరుగులు బాదిన ఆఫ్ఘనిస్థాన్
  • గతేడాది తుర్కియేపై 278 స్కోర్ బాదిన చెక్‌రిపబ్లిక్ జట్టు
హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెలరేగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డు స్థాయి విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి ఏకంగా 277 పరుగులు బాదిన ఆ జట్టు ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల రికార్డును నమోదు చేసింది. అయితే టీ20 ఫార్మాట్‌లో ఇది అత్యధిక స్కోరు కాదని గణాంకాలు చెబుతున్నాయి.

2023లో మంగోలియాపై నేపాల్ జట్టు ఏకంగా 314 పరుగులు బాదింది. కేవలం 3 వికెట్లు నష్టపోయి పెనువిధ్వంసం సృష్టించింది. ఇక 2019లో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 278/3 స్కోరు నమోదు చేసింది. అదే ఏడాది తుర్కియేపై చెక్ రిపబ్లిక్ కూడా 278/4 స్కోరు చేసింది. ఇక తాజా సంచలన స్కోరు 277/3 నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 2023లో ఆంధ్రా జట్టుపై పంజాబ్ 275/6 స్కోరు నమోదు చేసి 5వ స్థానంలో నిలిచింది.

కాగా ముంబై ఇండియన్స్‌ బౌలర్లపై సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కేవలం 3 వికెట్లు నష్టపోయి 277  పరుగులు బాదారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేయడంలో ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 62), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్), ఐడెన్ మార్‌క్రమ్ (42 నాటౌట్) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో ముంబైపై సన్‌రైజర్స్ జట్టు 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Sunrisers hyderabad
Mumbai Indians
T20 Format
IPL 2024
IPL

More Telugu News