IndiGo: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన ఇండిగో విమానం!

  • నిలిపి ఉంచిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ రెక్కలను తాకుతూ వెళ్లిన ఇండిగో విమానం
  • విమానం పార్క్ చేసే సమయంలో ఘటన
  • డీజీసీఏ సీరియస్.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశం
  • బాధ్యులైన ఇండిగో పైలట్లను విధులకు దూరం చేసిన వైనం 
IndiGo flight hits Air India Express plane at Kolkata airport DGCA takes action against pilots

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఇండిగో విమానం ఢీకొట్టిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. ఘటనకు కారణమైన ఇండిగో విమాన పైలట్లను తాత్కాలికంగా విధులకు దూరం చేసింది. 

చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని సంస్థ ప్రతినిధి తెలిపారు. అప్పుడే ల్యాండైన ఇండిగో విమానం పార్కింగ్ కోసం వస్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానం రెక్కలను తాకుతూ వెళ్లిందని అన్నారు. ఘటన తరువాత విమానానికి అదనపు తనిఖీలు నిర్వహించామని, ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. డీజీసీఏ, ఎయిర్‌పోర్టు అధికారులతో ఈ విషయమై నిరంతరం టచ్‌లో ఉన్నామని చెప్పుకొచ్చారు.

More Telugu News