BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ... విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరికి టికెట్

  • ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు
  • 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ
  • ఎంపీ స్థానాల అభ్యర్థుల జాబితా ఇదివరకే ప్రకటన
  • నేడు 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
BJP releases AP assembly candidates list

ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ నేడు తమ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 

ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులను ఇటీవలే ప్రకటించిన బీజేపీ... నేడు 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఎంతో చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ వెస్ట్ టికెట్ ను సుజనా చౌదరికి కేటాయించింది. 

విజయవాడ వెస్ట్ టికెట్ ఏపీలోనే హాట్ సీట్ గా పేరొందింది. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన నేతలు కూడా రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్టు అర్థమవుతోంది. ఇక, బీజేపీ అగ్రనేతలు ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్ లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు.

బీజేపీ జాబితా ఇదే...

  • సుజనా చౌదరి- విజయవాడ వెస్ట్
  • కామినేని శ్రీనివాస్- కైకలూరు
  • వై. సత్యకుమార్- ధర్మవరం
  • పి. విష్ణుకుమార్ రాజు- విశాఖ నార్త్
  • ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు
  • పీవీ పార్థసారథి- ఆదోని
  • ఎన్. ఈశ్వరరావు- ఎచ్చెర్ల
  • బొజ్జా రోషన్న- బద్వేలు
  • శివకృష్ణంరాజు- అనపర్తి
  • పాంగి రాజారావు- అరకులోయ

More Telugu News