Arvind Kejriwal: రబ్రీదేవిలా సునీత సీఎం స్థానంలో కూర్చుంటారు: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

Sunita Kejriwal will do a Rabri in Delhi says Anurag Thakur big claim
  • లాలూ ప్రసాద్ అరెస్టయ్యాక రబ్రీదేవి పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారన్న కేంద్రమంత్రి
  • అలాగే సునీత ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతారని వ్యాఖ్య
  • ఇటీవల లైవ్ వీడియోలో తన భర్త స్థానంలో కూర్చున్న సునీత  
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత మరో రబ్రీదేవి అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. బీహార్‌లో పశుగ్రాసం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టయ్యాక రబ్రీదేవి పొలిటికల్ స్క్రీన్‌పైకి వచ్చారని, ఆ తర్వాత క్రమంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారని, ఇప్పుడు అదే తరహాలో సునీత ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ తాత్కాలిక సీఎంగా సునీత పాలనా పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ లైవ్ వీడియోలో తన భర్త కేజ్రీవాల్ ఎక్కడ కూర్చుంటారో అక్కడే సునీత కూర్చున్నారు. దీంతో ఆమె తాత్కాలిక సీఎంగా బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలకు బలం చేకూరింది.
Arvind Kejriwal
AAP
New Delhi
BJP

More Telugu News