Ch Malla Reddy: తెలంగాణకు ఏం చేశారు?: కాంగ్రెస్, బీజేపీలపై మల్లారెడ్డి ఆగ్రహం

  • రెండు జాతీయ పార్టీలకూ తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్న మల్లారెడ్డి
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు? అని మండిపాటు
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్య
Malla Reddy fires at BJP and Congress

కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి విమర్శలతో మండిపడ్డారు. బుధవారం ఆయన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పుకుంటున్నాయని... కానీ తెలంగాణకు వారు చేసింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. రెండు జాతీయ పార్టీలకూ తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆ పార్టీల నేతలు ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారో చెప్పాలన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఆ పార్టీలకు తెలంగాణలో ఓటు బ్యాంకే లేదన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయన సీఎం అయితేనే ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయన్నారు.

More Telugu News