Nagababu: పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్.. విరుద్ధంగా మాట్లాడితే చర్యలు తప్పవు: నాగబాబు

In candidates selection Pawan Kalyan decision is final says Nagababu
  • అభ్యర్థుల ఎంపికలో పవన్ నిర్ణయమే ఫైనల్ అన్న నాగబాబు
  • అధ్యక్షుడి నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడొద్దని హెచ్చరిక
  • విరుద్ధంగా మాట్లాడితే పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని వ్యాఖ్య
ఏపీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుల విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టికెట్ దక్కని ఆశావహులు సొంత పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

జనసేన అభ్యర్థుల విషయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమమని నాగబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ ఒక నిర్ణయానికి వస్తారనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేజేజ్ మెంట్ విభాగం బాధ్యులతో చర్చిస్తుందని... సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Nagababu
Pawan Kalyan
Janasena

More Telugu News