ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
- బీజాపూర్ జిల్లాలో ఈ ఉదయం ఎన్ కౌంటర్
- మృతుల్లో ఓ మహిళా మావోయిస్టు
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
మిగతా మావోయిస్టుల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం కూడా ఉందని వెల్లడించాయి. మావోయిస్టుల డంప్ లో భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ఇటీవల ఈ ఏరియాలోనే ముగ్గురు స్థానికులను మావోయిస్టులు చంపేశారు.