Viral Videos: స్కూలుకు తాగొచ్చిన టీచర్‌పై చెప్పులు విసిరిన స్టూడెంట్స్.. వీడియో ఇదిగో!

  • నిత్యం స్కూలుకు తాగొస్తున్న టీచర్
  • పాఠాలు చెప్పకుండా స్కూల్లోనే నిద్రపోతున్న వైనం
  • ఇటీవల ఓ రోజు మళ్లీ తాగొచ్చి విద్యార్థులను తిట్టిపోసిన టీచర్
  • సహనం కోల్పోయిన స్టూడెంట్స్ టీచర్‌పై చెప్పులతో దాడి
Chhattisgarh students chase drunk teacher away throw slippers at him

స్కూలుకు తాగొచ్చి తమను దుర్భాషలాడిన ఓ టీచర్‌ పై స్టూడెంట్లు తిరగబడ్డారు. అతడిపై చెప్పులు విసురుతూ స్కూలు ప్రాంగణం నుంచి తరిమేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

ఘటన జరిగిన రోజున ఆ టీచర్ బాగా తాగి స్కూలుకు వచ్చాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా వారిని తిట్టడం ప్రారంభించాడు. దీంతో, విసిగిపోయిన వారు టీచర్‌పై చెప్పులు విసిరారు. విద్యార్థుల ధాటికి తట్టుకోలేక టీచర్ అక్కడి నుంచి పారిపోయాడు. 

కాగా, ఈ టీచర్ తరచూ స్కూలుకు తాగి వచ్చేవాడని విద్యార్థులు తెలిపారు. పాఠాలు చెప్పడం మానేసి తరగతి గదిలోనే ఓ మూల చాప వేసుకుని నిద్రపోయేవాడని అన్నారు. తమకు పాఠాలు చెప్పాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకునే వాడు కాదని ఆరోపించారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన విద్యార్థులు టీచర్‌కు గుణపాఠం చెప్పారు.

More Telugu News