K Kavitha: వ్యానులో కవితను తీహార్ జైలుకు తరలించిన పోలీసులు

  • కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
  • ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లోనే  
  • పది రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవిత
Kavitha sent to Tihar jail today

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు మంగళవారం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఆమెను మధ్యాహ్నం జైలు వ్యాన్‌లో తీహార్ జైలుకు తరలించారు. ఆమె ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లో ఉండనున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచవలసి ఉంటుంది.

కవితను ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో పన్నెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మరుసటి రోజు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి... పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. న్యాయస్థానం ఆమెను తొలుత 7 రోజులు... ఆ తర్వాత 3 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ రోజు తిరిగి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతో ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

More Telugu News