JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్యకు చెందిన ఎస్‌యూవీ చోరీ!

SUV belonging to BJP President JP Naddas wife stolen in Delhi
  • హిమాచల్ ప్రదేశ్‌లో నడ్డా భార్య పేరిట రిజిస్టరైన ఎస్‌యూవీ
  • ఇటీవల ఎస్‌యూవీని ఢిల్లీలో సర్వీసింగ్‌కు ఇచ్చిన డ్రైవర్
  • డ్రైవర్ సర్వీస్ సెంటర్‌కు తిరిగొచ్చే సరికి కారు మాయం
  • కారు చివరిసారిగా గురుగ్రామ్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో వెల్లడి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య పేరిట రిజిస్టరైన ఓ ఎస్‌యూవీ ఢిల్లీలో చోరీకి గురైంది. స్థానిక పోలీసులు ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. కారు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నడ్డా భార్య పేరిట ఉన్న టాటా ఫార్చునర్‌ను మార్చి 19న కారు డ్రైవర్ గోవింద్‌పురిలోని ఓ సర్వీస్ సెంటర్‌లో సర్వీసింగ్‌కు ఇచ్చారు. ఆ తరువాత ఇంటికి వెళ్లిన అతడు తిరిగొచ్చేసరికి నిందితులు కారును తీసుకెళ్లిపోయారు. 

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కారు చివరిసారిగా గురుగ్రామ్ వైపు వెళ్లినట్టు బయటపడింది. అయితే, కారు జాడ కోసం పలు ప్రయత్నాలు చేసినా ఇంకా ఆచూకీ అభించలేదు. ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక, నడ్డా భార్య కారు హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టరైనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
JP Nadda
Car Stolen
New Delhi
BJP

More Telugu News