BJP: తెలంగాణలో మూడో జాబితా ప్రకటించిన బీజేపీ

BJP releases third list of Lok Sabha candidates for Telangana
  • తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు
  • ఇప్పటికే 15 మందిని ప్రకటించిన బీజేపీ
  • మిగిలిన ఇద్దరితో నేడు తుది జాబితా విడుదల 
బీజేపీ ఇవాళ తెలంగాణలో తమ లోక్ సభ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇద్దరి పేర్లు ఉన్నాయి. తెలంగాణలో వరంగల్ (ఎస్సీ) లోక్ సభ స్థానానికి ఆరూరి రమేశ్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. మార్చి 2న విడుదల చేసిన తొలి జాబితాలో బీజేపీ 9 మందిని ఖరారు చేసింది. రెండో జాబితాలో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. నేడు విడుదల చేసిన మూడో జాబితాలో ఇద్దరి పేర్లతో కలుపుకుని తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది.

బీజేపీ పూర్తి జాబితా...

1. కిషన్ రెడ్డి- సికింద్రాబాద్
2. బండి సంజయ్- కరీంనగర్
3. ధర్మపురి అర్వింద్- నిజామబాద్
4. ఈటల రాజేందర్- మల్కాజ్ గిరి
5. పోతుగంటి భరత్- నాగర్ కర్నూల్ (ఎస్సీ)
6. బూర నర్సయ్య గౌడ్- భువనగిరి
7. కొండా విశ్వేశ్వర్ రెడ్డి- చేవెళ్ల
8. బీబీ పాటిల్- జహీరాబాద్
9. డాక్టర్ మాధవీలత- హైదరాబాద్
10. గోడం నగేశ్- ఆదిలాబాద్ (ఎస్టీ)
11. డీకే అరుణ- మహబూబ్ నగర్
12. సీతారాం నాయక్- మహబూబాబాద్
13. గోమాస శ్రీనివాస్- పెద్దపల్లి
14. రఘునందన్ రావు- మెదక్
15. శానం సైదిరెడ్డి- నల్గొండ
16. ఆరూరి రమేశ్- వరంగల్ (ఎస్సీ)
17. తాండ్ర వినోద్ రావు- ఖమ్మం
BJP
Telangana
Third List
Lok Sabha Polls

More Telugu News