Wines Close: జంటనగరాల పరిధిలో... హోలీ సందర్భంగా వైన్ షాపుల మూసివేత

  • బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూత
  • హోలీ సందర్భంగా పోలీసుల ఆదేశాలు
  • స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు
Wine Shops And Bars Will Be Closed On 25th March Due To Holi

జంటనగరాల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాప్ లు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ ను మూసి ఉంచాలని సూచించారు. అయితే, స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయించారు. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు ఆదేశాలు జారీ చేశారు.

ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 26న సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లుదుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హోలీ ఆనందంగా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకుంటూ వచ్చీపోయే వారికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై వెళ్లే వారిపై, వాహనదారులపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చి గుంపులు గుంపులుగా ప్రయాణించ వద్దని సూచించారు.

More Telugu News