Chiranjeevi: శ్రీకాంత్ నివాసానికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi wishes Srikanth on his birthday
  • నేడు (మార్చి 23) నటుడు శ్రీకాంత్ పుట్టినరోజు
  • శ్రీకాంత్ తో కేక్ కట్ చేయించిన చిరంజీవి
  • సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్
హీరో శ్రీకాంత్ కు, మెగా ఫ్యామిలీకి మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ కు ఎంతో అనుబంధం ఉంది. వీళ్లిద్దరూ కలిసి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ బ్లాక్ బస్టర్ హిట్టయింది. అందులో చిరంజీవి శంకర్ దాదా పాత్ర పోషించగా, ఏటీఎమ్ పాత్రలో శ్రీకాంత్ కామెడీ పండించారు. 

ఇవాళ (మార్చి 23) శ్రీకాంత్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, చిరంజీవి తన సన్నిహితుడు శ్రీకాంత్ నివాసానికి వెళ్లి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాంత్ తో కేక్ కట్ చేయించారు. ఆ కేక్ పై... "హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్... లవ్ ఫ్రమ్ అన్నయ్య" అని రాసి ఉంది.

ఈ సందర్భంగా శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్ తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Chiranjeevi
Srikanth
Birthday
Tollywood

More Telugu News