BJP: కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేస్తారన్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ ఎంపీ కౌంటర్

  • జైలు నుంచి గ్యాంగ్‌లను నడుపుతారని... పరిపాలన కాదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి కౌంటర్
  • కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ప్రజలు స్వీట్లు పంచుకొని, క్రాకర్స్ పేల్చి సంబరాలు చేసుకున్నారని వ్యాఖ్య
  • అరెస్టై రెండురోజులైనా ఎవరూ మద్దతుగా రావడం లేదన్న మనోజ్ తివారి
BJP MP Criticises Delhi CM Arvind Kejriwal Says Gangs Run From Jail

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన సాగిస్తారన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ శనివారం కౌంటర్ ఇచ్చారు. సుపరిపాలన అంటే ప్రజలతో కలిసి నడవడం అన్నారు. అయినా జైలు నుంచి నడిచేవి గ్యాంగ్‌స్టర్ ముఠాలు అని చురక అంటించారు. కేజ్రీవాల్ అరెస్టైనప్పటికీ ఆయన సీఎం పదవికి రాజీనామా చేయరని... ఆయన జైలు నుంచి పాలన చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'మనం జైలు నుంచి నడిచే గ్యాంగ్‌లను చూస్తాం... కానీ పరిపాలన మాత్రం కాదు' అని పేర్కొన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీవాసులంతా స్వీట్లు పంచుకొని, క్రాకర్స్ పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. కేజ్రీవాల్ అరెస్టై రెండు మూడు రోజులవుతోందని... అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్‌కు మద్దతుగా ఎవరూ కనిపించడం లేదన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ చేపడుతున్న నిరసనలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. తాను ముఖ్యమంత్రిని అని అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారని... కానీ దేశంలో ప్రతి నేరస్థుడిని ఒకేలా చూస్తారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ పాత్ర ఏమిటో త్వరలో తెలుస్తుందన్నారు.

More Telugu News