Chandrababu: వైసీపీ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలి: చంద్రబాబు

Chandrababu says digital currency must be implemented to tackle parties like YSRCP
  • పెద్ద నోట్ల రద్దు కావాలనేది తన ఆలోచన అన్న చంద్రబాబు
  • మోదీ కూడా ఆ దిశగా ఆడుగులు వేస్తున్నారని వెల్లడి
  • రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలని వ్యాఖ్యలు
దేశంలో పెద్ద నోట్లు రద్దు కావాలనేది తన ఆలోచన అని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ వంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని అభిప్రాయపడ్డారు. రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేసే పరిస్థితి రావాలని అన్నారు. రాష్ట్ర సంపదనంతా హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ అక్రమాలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని చంద్రబాబు తెలిపారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని విమర్శించారు. అసలు, జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని అన్నారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటాడని ధ్వజమెత్తారు.
Chandrababu
Digital Currency
TDP
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News