KTR: ఇద్ద‌రు మాజీ సివిల్ స‌ర్వెంట్ల‌కు బీఆర్ఎస్ ఎంపీ టికెట్‌.. కేటీఆర్ ఏమ‌న్నారంటే..!

  • నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ 
  • మెదక్ నుంచి పోటీ చేయనున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
  • ఈ ఇద్ద‌రిని ప్ర‌జ‌లు గెలిపించి పార్ల‌మెంట్‌కు పంపుతార‌నే న‌మ్మ‌కం ఉందన్న కేటీఆర్   
KTR Lauds KCR Choice of Choosing Two Former All India Service Officers to Represent BRS in Lok Sabha

పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు 13 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. దీనిలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ శుక్ర‌వారం ఇద్ద‌రు కొత్త‌ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మెదక్ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డి, అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. ఇలా ఇద్ద‌రు మాజీ సివిల్ స‌ర్వెంట్ల‌కు బీఆర్ఎస్ లోక్‌స‌భ ఎంపీ టికెట్లు కేటాయించ‌డం ప‌ట్ల ఆ పార్టీ మాజీ మంత్రి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక ట్వీట్ చేశారు. 

"ఇద్ద‌రు ఆల్ ఇండియా మాజీ ఆఫీస‌ర్లు బీఆర్ఎస్ టికెట్‌పై లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్నారు. ఈ గొప్ప నిర్ణ‌యం తీసుకున్న‌ కేసీఆర్ గారికి అభినంద‌న‌లు. నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌, మెద‌క్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డిల‌కు శుభాకాంక్ష‌లు. ఈ ఇద్ద‌రిని ప్ర‌జ‌లు గెలిపించి పార్ల‌మెంట్‌కు పంపుతార‌నే న‌మ్మ‌కం ఉంది" అని కేటీఆర్ త‌న‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.  

ఇదిలాఉంటే.. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ 13 స్థానాలకు అభ్యర్థులను ఖ‌రారు చేసింది. మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో కీలకమైన నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలు ఉన్నాయి. 

బీఆర్ఎస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు వీరే..
1. చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 
2. వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
3. మల్కాజ్ గిరి - రాగిడి లక్ష్మారెడ్డి
4. ఆదిలాబాద్ - ఆత్రం సక్కు
5. జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
6. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్
7. కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్
8. పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్
9. మహబూబ్‌ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి
10. ఖమ్మం -నామా నాగేశ్వరరావు
11. మహబూబాబాద్(ఎస్టీ)- మాలోత్ కవిత
12. మెదక్ - వెంకట్రామిరెడ్డి
13. నాగర్ కర్నూలు - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

More Telugu News