Digvijaya Singh: 33 ఏళ్ల త‌ర్వాత లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్

Digvijaya Singh Contest from Rajgarh Lok Sabha seat of Madhya Pradesh
  • లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాజ్‌గ‌ఢ్ నుంచి పోటీ చేస్తున్న‌ట్లు దిగ్విజ‌య్ సింగ్ ప్ర‌క‌ట‌న‌
  • పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌య‌మ‌న్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌
  • గ‌తంలో రాజ్‌గ‌ఢ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన దిగ్విజ‌య్ సింగ్ 

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ దిగ్విజ‌య్ సింగ్ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న రాజ్‌గ‌ఢ్ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధిష్ఠానం ఆదేశాల మేర‌కు తాను రాజ్‌గ‌ఢ్ నుంచి పోటీ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. కాగా, దిగ్విజ‌య్ సింగ్ 33 ఏళ్ల త‌ర్వాత రాజ్‌గ‌ఢ్ నుంచి పోటీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

ఇక ఈ సీనియ‌ర్ నేత మొద‌టి నుంచి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు నిరాక‌రిస్తూనే వ‌చ్చారు. రాజ్య‌స‌భ‌లో త‌న ప‌ద‌వీకాలం ఇంకా రెండేళ్లు ఉంద‌ని, అందుకే లోక్‌స‌భకు పోటీ చేయ‌న‌ని గ‌తంలో పేర్కొన్నారు. కానీ, తాజాగా జ‌రిగిన కాంగ్రెస్ ఎన్నిక‌ల క‌మిటీ స‌మావేశంలో పార్టీలోని దిగ్గ‌జ‌ నేత‌ల‌ను రంగంలోకి దింపాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యించింది. దీంతో రాజ్‌గ‌ఢ్ పార్ల‌మెంట్‌ స్థానం నుంచి మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ పేరును ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. 

దీంతో దిగ్విజ‌య్ రాజ్‌గ‌ఢ్ నుంచి బ‌రిలోకి దిగుతున్నారు. మాజీ సీఎం పోటీ ప్ర‌క‌ట‌న‌తో కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారులు బాణసంచా కాల్చి, త‌మ గెలుపు ఖాయ‌మ‌ని సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే.. ఇంత‌కుముందు రాజ్‌గ‌ఢ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి దిగ్విజ‌య్ సింగ్ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల త‌ర్వాత తిరిగి అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక ఇప్ప‌టికే రాష్ట్రంలోని 29 లోక్‌స‌భ స్థానాల‌కు బీజేపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. కానీ, కాంగ్రెస్ ఇంకా అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది.

  • Loading...

More Telugu News