K Kavitha: ఆరో రోజు ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

Kavitha ED interagation completed on sixth day
  • ఆదివారం నుంచి కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు
  • రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ
  • నేడు ములాఖత్ సమయంలో కవితతో తనయుడి భేటీ
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం... ఆరో రోజు విచారించారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసిన ఈడీ మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆమెను రేపు తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. మరోవైపు, ములాఖత్ సమయంలో తన తల్లిని, తనయుడిని కలిసేందుకు ఈడీ మూడు రోజుల క్రితం కవితకు అనుమతించింది. దీంతో నిన్న కవిత శోభమ్మ ఆమెను కలిశారు. ఈ రోజు కవిత తనయుడు కలవనున్నారు.
K Kavitha
BRS
ED

More Telugu News