Pawan Kalyan: పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయం

Pawan Kalyan decides to starts his state wide campaign from Pithapuram
  • పిఠాపురం అసెంబ్లీ బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్
  • ఈ ఉదయం జనసేన నేతలతో పవన్ సమావేశం
  • పిఠాపురం కేంద్రంగా  రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సాగించాలని నిర్ణయం
  • ఇకపై పిఠాపురం నుంచే రాకపోకలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ ఉదయం పవన్ కల్యాణ్ జనసేన నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. పురూహూతిక దేవికి పూజలు నిర్వహించిన అనంతరం, వారాహి వాహనంలో ప్రచారానికి బయల్దేరాలని పవన్ నిర్ణయించారు. 

పిఠాపురం నియోజవకర్గంలోనే మూడ్రోజులు ప్రచారం నిర్వహించనున్న పవన్ కల్యాణ్... పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర స్థాయిలో ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించనున్నారు. 

కాగా, పిఠాపురం నుంచి జనసేన ఎన్నికల సమరశంఖం పూరిస్తుందని, ఆ శంఖారావం రాష్ట్రమంతా వినిపించాలని పవన్ కల్యాణ్ నేతలకు నిర్దేశించారు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని, కచ్చితంగా విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు.
Pawan Kalyan
Pithapuram
Janasena
Andhra Pradesh

More Telugu News