Radhika: లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి రాధిక

Actress Radhika contesting from BJP IN Lok Sabha elections

  • ఈరోజు లోక్ సభ అభ్యర్థుల నాలుగో జాబితా ప్రకటించిన బీజేపీ
  • విరుధ్ నగర్ నుంచి రాధిక, చెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ
  • ఇటీవలే తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన రాధిక భర్త శరత్ కుమార్

సినీ స్టార్లకు రాజకీయాలపై మక్కువ ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. దేశంలోని అన్ని భాషల సినీ నటులు రాజకీయాల్లో ఉన్నారు. తమిళనాడులో అయితే పొలిటికల్ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా సీనియర్ నటి రాధిక లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ ఈరోజు ప్రకటించిన నాలుగో జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. తమిళనాడులోని విరుధ్ నగర్ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. రాధిక భర్త శరత్ కుమార్ ఇటీవలే తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ నుంచి బరిలోకి దిగుతున్నారు.

Radhika
Tollywood
Kollywood
BJP
Lok Sabha Polls
  • Loading...

More Telugu News