Stock Market: నష్టాల్లో ప్రారంభమై.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 191 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 85 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మూడున్నర శాతం లాభపడ్డ మారుతి షేరు విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే లాభాల్లోకి మళ్లాయి. ఆ తర్వాత చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 191 పాయింట్లు లాభపడి 72,832కి పెరిగింది. నిఫ్టీ 85 పాయింట్లు పుంజుకుని 22,097 వద్ద స్థిరపడింది. టెక్, ఐటీ సూచీలు మినహా అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ మరో 34 పైసలు క్షీణించింది. ప్రస్తుతం మన రూపాయి విలువ రూ. 83.47గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.55%), సన్ ఫార్మా (2.77%), టైటాన్ (2.21%), ఐటీసీ (1.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.70%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.98%), విప్రో (-2.73%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.46%), టీసీఎస్ (-1.53%), టెక్ మహీంద్రా (-1.33%).

More Telugu News