Whatsapp: టెక్ట్స్ మెసేజ్ రూపంలోకి వాయిస్ నోట్ లు... కొత్త ఫీచర్ తీసుకువస్తున్న వాట్సాప్

  • వాయిస్ మెసేజ్ లను టెక్ట్స్ మెసేజ్ లు గా మార్చే టెక్నాలజీ
  • స్పీచ్ రికగ్నిషన్ సాంకేతికతో పనిచేసే కొత్త ఫీచర్
  • ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఫీచర్ 
Whatsapp brings new feature that can turn voice notes into text messages

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఈ నయా ఫీచర్ ద్వారా వాయిస్ నోట్ లను టెక్ట్స్ రూపంలోకి మార్చడం సాధ్యపడుతుంది.  స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్ మెసేజ్ లను టెక్ట్స్ రూపంలోకి మార్చుతారు. వాయిస్ మెసేజ్ లను వినే పరిస్థితి లేనప్పుడు, ఆ మెసేజ్ లను సందేశాల రూపంలో చదువుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. 

ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ బీటా వెర్షన్ రూపంలో అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ప్రయోగాత్మకంగా అందించనున్నారు. వినికిడి లోపం ఉన్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తోంది.

More Telugu News