Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను లక్ష మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాది: టీడీపీ

 It is our responsibility to make Pawan Kalyan win with a majority of one lakh says TDP
  • పవన్ ను ఓడించే వాళ్లలో ముందు వరుసలో ఉండేది టీడీపీనే అన్న వైసీపీ
  • మీ భార్య రాసే అబద్ధాలను మీ చెల్లి ఛీ కొట్టింది జగన్ అన్న టీడీపీ
  • ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతున్నావ్ అని వ్యాఖ్య
జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ చేసిన ట్వీట్ కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. 'జాగ్రత్త పవన్ కల్యాణ్. ఏదన్నా అటూఇటూ అయితే పిఠాపురంలో నిన్ను ఓడించే వాళ్లలో మొదటి వరుసలో ఉండేది టీడీపీనే అనుకుంటా... చూస్కో మరి' అని వైసీపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై టీడీపీ స్పందిస్తూ... మీ భార్య భారతి రెడ్డి రాసే అబద్ధాలను మీ చెల్లి ఛీ కొట్టింది జగన్ అని ఎద్దేవా చేసింది. అలాంటిది ఏపీ ప్రజలు నమ్ముతారని ఎలా అనుకున్నారని ప్రశ్నించింది. పవన్ ను జనసైనికులతో కలిసి లక్ష మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత టీడీపీదే అని చెప్పింది. కొంపలో కుంపటితో నీ పులివెందులలో బొక్క పడింది... ముందు దాన్ని పూడ్చుకో. సీఎం సీటుతో పాటు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతున్నావ్ అని వ్యాఖ్యానించింది.
Pawan Kalyan
Janasena
Telugudesam
YSRCP

More Telugu News