Chandrababu: చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్

Pawan Kalyan went to Chandrababu residence
  • జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్
  • ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్న నేతలు
  • చిలకలూరిపేట సభ తర్వాత తొలి భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరూ చర్చిస్తున్నారు. పెండింగ్ అభ్యర్థులు, ఎన్నికల ప్రచారం గురించి చర్చ జరుపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రచారాన్ని నిర్వహించడంపై చర్చిస్తున్నారు. సభలు, సమావేశాలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ 50 రోజులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. చిలకలూరిపేట సభ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలవడం ఇదే తొలిసారి.
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
AP Politics

More Telugu News