Congress: 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. రేపో మాపో కాంగ్రెస్‌లో చేరుతారు: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Government whip Ilaiah hot comments on brs mlas
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారన్న ఐలయ్య
  • ప్రజాకర్షక పథకాలకు ఆకర్షితులై వారు పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని వెల్లడి
  • రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటారని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వారు రేపో మాపో కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేస్తున్నామని... ఈ ప్రజాకర్షక పథకాలను చూసి వారు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు చెప్పారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారన్నారు. ప్రజాసంక్షేమమే తమ పార్టీకి ముఖ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సహా అందరికీ అందుబాటులో ఉంటారని, ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. 

కాగా, ప్రస్తుతం కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 39 మంది గెలిచినప్పటికీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు.
Congress
BRS
Revanth Reddy

More Telugu News