RS Praveen Kumar: కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లో రూ.16,400 కోట్ల అప్పులు చేసింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • కేసీఆర్ రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపిస్తున్నారని ఆగ్రహం
  • నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పెద్ద ఎత్తున అప్పులు చేసిందని విమర్శ
  • కేసీఆర్ చేసిన అప్పులతో కనీసం మౌలిక సదుపాయాలు వచ్చాయన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • కాంగ్రెస్ అప్పులతో అభివృద్ధి లేదని ఆగ్రహం
RS Praveen Kumar fires at congress government debts

కేసీఆర్ ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని... కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలల కాలంలోనే రూ.16,400 కోట్ల అప్పులు చేసిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ అప్పులకు తోడు అనధికారికంగా కార్పోరేషన్ల పేరుతో అప్పును రెండింతలు చేశారని ఆరోపించారు. వీటిని బడ్జెట్‌లో కూడా చూపించరన్నారు.

కేసీఆర్ చేసిన అప్పులతో కనీసం మౌలిక సదుపాయాలైనా వచ్చాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులతో అభివృద్ధి ఊసు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యారెంటీల గారడీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News