Ram Charan: వైజాగ్ బీచ్ లో క్లీంకార, ఉపాసనతో రామ్ చరణ్ షికారు... వీడియో ఇదిగో!

Ram Charan enjoys at Vizag beach along with wife Upasana and daughter Klin Kaara
  • గేమ్ చేంజర్ షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన రామ్ చరణ్
  • వైజాగ్ బీచ్ లో సూర్యోదయాన్ని ఆస్వాదించిన గ్లోబల్ స్టార్
  • స్థానిక మత్స్యకారులతో మాట్లాడిన రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా విశాఖలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్, తన అర్ధాంగి ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి వైజాగ్ బీచ్ లో సందడి చేశారు. 

ఉదయం పూట తన కుటుంబంతో కలిసి బీచ్ కు వచ్చిన రామ్ చరణ్... సూర్యోదయాన్ని ఆస్వాదించారు. క్లీంకారకు కూడా సముద్రపు అలలను పరిచయం చేశారు. స్థానిక మత్స్యకారులతో రామ్ చరణ్ మాట్లాడారు. వారు పట్టుకొచ్చిన చేపలను ఆసక్తిగా పరిశీలించారు. రామ్ చరణ్, ఉపాసన తమ పెంపుడు కుక్క పూడిల్స్ ను కూడా బీచ్ వద్దకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. 

ఇక, షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన రామ్ చరణ్ కు అభిమానుల నుంచి తాకిడి మామూలుగా లేదు. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తుతున్నారు. ఫ్యాన్స్ ను నియంత్రించడానికి చరణ్ భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
Ram Charan
Upasana
Klin Kaara
Vizag Beach
Game Changer
Shankar
Tollywood
Kollywood

More Telugu News