Virat Kohli: తమ ఇంటి ముందు కారు పార్కింగ్ చేశారని దంపతులపై దాడి

Couple Thrashed For Parking Car Near Neighbours House In Bengaluru
  • బెంగళూరులో ఘటన
  • అంతకుముందు రోజు ఆ ప్రాంతంలో దిగిన దంపతులు
  • ఎదురుతిరిగిన బాధితుడిని కిందపడేసి విచక్షణ రహితంగా దాడి
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తమ ఇంటి ముందు కారు పార్కు చేసిన పొరుగింటి వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడిచేసి చితకబాదారు. బెంగళూరులో గతరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బాధితుడు తన కారును పొరిగింటి ముందు ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్లేస్‌లో పార్క్ చేశాడు. అదే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. 

ఇద్దరు వ్యక్తులు ఆ కారును చూపిస్తూ దాడి చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బాధితుడు తిరగబడేందుకు ప్రయత్నించగా, వారు అతడిని కిందపడేసి పిడిగుద్దులు కురిపించారు. వీడియోలో బాధితుడి భార్య కూడా కనిపించింది. ఈ మొత్తం ఘటనను ఆమె రికార్డు చేసింది. ఆమె వీడియో చేస్తున్న విషయం తెలుసుకున్న నిందితుల గ్రూపులోని ఓ మహిళ చెప్పుతో ఆమెను వెంబడించింది. పొరుగింటి వ్యక్తులు కూడా ఈ ఘటనను వీడియో తీశారు. 

బాధితులు రోహిణి, సహిష్ణు ఒక్క రోజు ముందే ఆ అపార్ట్‌మెంట్‌లో దిగినట్టు తెలుస్తోంది. తన భర్తపై దాడిచేస్తుండగా వీడియో తీస్తున్న ఆమెను మరో మహిళ చెప్పుతో వెంబడించడంతో ఆమె సాయం చేయాలని అరవడం వీడియోలో కనిపించింది. వీడియో వైరల్ అయిన తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Virat Kohli
Bengaluru
Attack
Crime News

More Telugu News