prajavani: లోక్ సభ ఎన్నికలు... తెలంగాణలో 'ప్రజావాణి'కి తాత్కాలిక బ్రేక్

Break for Praja Vani till lok sabha election
  • లోక్ సభఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణికి బ్రేక్
  • హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం
  • జూన్ 7 నుంచి తిరిగి యథాతథంగా ప్రజావాణి కార్యక్రమం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు దీనిని రద్దు చేశారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ 7న తిరిగి యథాతథంగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు వెల్లడించారు. జిల్లాల్లోనూ ప్రజావాణిని రద్దు చేసినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.
prajavani
Telangana
Lok Sabha Polls

More Telugu News