Vaiva Harsha: ఈ వారం ఓటీటీకి వస్తున్న తెలుగు సినిమాలివే!

  • ఈటీవీ విన్ లో 'సుందరం మాస్టర్' 
  • ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • అదే రోజున ఆహాలో 'భూతద్దం భాస్కర్'
  • నెట్ ఫ్లిక్స్ లో రానున్న 'లాల్ సలామ్'

OTT Movies Update

ఈ శుక్రవారం .. అంటే 22వ తేదీన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రెండు తెలుగు సినిమాలు రానున్నాయి. ఒకటి 'సుందరం మాస్టర్' అయితే, మరొకటి 'భూతద్దం భాస్కర్'. వైవా హర్ష కథానాయకుడిగా రూపొందిన  సుందరం మాస్టర్' సినిమా, ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. కల్యాణ్ సంతోష్ దర్శజత్వం వహించిన ఈ సినిమాలో, దివ్య శ్రీపాద కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాను చాలా గట్టి ప్రమోషన్స్ ఇచ్చి మరీ వదిలారు. కామెడీ టచ్ తో నడిచే ఈ కంటెంట్ చాలామందికి బాగానే కనెక్ట్ అయింది. 'సుందరం మాస్టర్' ఒక అడవికి వెళ్లి అక్కడ చేసిన హడావిడి ప్రేక్షకులను నవ్వించింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 22వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. ఇక అదే రోజున 'ఆహా'లో 'భూతద్దం భాస్కర్' స్ట్రీమింగ్ కానుంది.  'భూతద్దం భాస్కర్ నారాయణ' ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. పురుషోత్తమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శివ కందుకూరి .. రాశి సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. ఇక అదే రోజున రజనీకాంత్ 'లాల్ సలామ్' నెట్ ఫ్లిక్స్' నుంచి పలకరించనుంది. 

More Telugu News