Election Commission: పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు

EC orders dismissal of home secretaries of six states
  • ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వుల జారీ
  • బీహార్, గుజ‌రాత్, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌, ఝార్ఖండ్, ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ హోంశాఖ కార్య‌ద‌ర్శుల‌ తొలగింపు
  • పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను తొలగించిన ఈసీ
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీహార్, గుజ‌రాత్, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌, ఝార్ఖండ్, ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ హోంశాఖ కార్య‌ద‌ర్శుల‌ను ఈసీ తొల‌గించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొల‌గించింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చాక ఈసీ మొదటిసారి ఈ చ‌ర్య‌లు తీసుకుంది. బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ (బీఎంసీ) అధికారుల‌ పైనా ఈసీ వేటు వేసింది. బీఎంసీ క‌మిష‌న‌ర్, అద‌న‌పు, డిప్యూటీ క‌మిషన‌ర్ల‌ను ఈసీ తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Election Commission
India
Gujarat
Uttar Pradesh

More Telugu News