Gujarat Titans: ఐపీఎల్ 2024కు కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగుతున్న గుజ‌రాత్ టైటాన్స్

  • ఈ నెల 24న అహ్మ‌దాబాద్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో తొలి మ్యాచ్ ఆడ‌నున్న గుజ‌రాత్‌
  • కొత్త సార‌థి శుభ‌మాన్ గిల్ నేతృత్వంలో బ‌రిలోకి దిగనున్న జీటీ
  • 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి టైటిల్ విజ‌యం
  • మ‌హ్మ‌ద్ ష‌మీ టోర్నీకి దూరం కావ‌డంతో ఇబ్బందిలో గుజ‌రాత్ టైటాన్స్ 
Gujarat Titans unveil redesigned jersey ahead of ipl 2024

ఈ ఏడాది గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. 2024 ఐపీఎల్ సీజ‌న్ తాలూకు కొత్త జెర్సీ వీడియోను ఎక్స్ (గ‌తంలో ట్విట‌ర్) ద్వారా తాజాగా విడుద‌ల చేసింది. ఈ 17వ సీజ‌న్‌లో గుజ‌రాత్ మార్చి 24న అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ముంబైతో జ‌రిగే మ్యాచ్‌తో త‌న జ‌ర్నీని ప్రారంభించ‌నుంది. అలాగే కొత్త సార‌థి శుభ‌మాన్ గిల్ నేతృత్వంలో గుజ‌రాత్ ఆడ‌నుంది. ట్రేడింగ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియ‌న్స్‌కు వెళ్లిపోవ‌డంతో గిల్‌కు కెప్టెన్సీ ద‌క్కిన విష‌యం తెలిసిందే. 

కాగా, పాండ్యా సార‌థ్యంలో గుజ‌రాత్ 2022లో టైటిల్ గెలిచింది. ఆ త‌ర్వాత గతేడాది ఫైన‌ల్‌కి వెళ్లింది. కానీ, చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో ఓట‌మితో రెండోసారి టైటిల్ చేజార్చుకుంది. ఫైన‌ల్‌లో ఓట‌మితో ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది. ఇదిలాఉంటే.. దుబాయి వేదిక‌గా జ‌రిగిన మినీ వేలంలో జీటీ.. ఆఫ్గాన్ ఆల్‌రౌండ‌ర్ అజ్మ‌తుల్లా ఓమ‌ర్‌జై, ఆస్ట్రేలియా ఆట‌గాడు స్పెన్స‌ర్ జాన్స‌న్‌ల‌ను కొనుగోలు చేసింది. అలాగే ఇప్ప‌టికే గుజ‌రాత్ బ్యాటింగ్ లైన‌ప్ కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. గిల్‌, కేన్ విలియ‌మ్స‌న్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, సాయి సుద‌ర్శ‌న్‌, వృద్ధిమాన్ సాహా, విజ‌య్ శంక‌ర్‌, షారూఖ్ ఖాన్ లాంటి ఆట‌గాళ్లు జీటీలో ఉన్నారు. అయితే, కీల‌క బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ జ‌ట్టుకు దూరం కావ‌డం గుజ‌రాత్‌కు ఇబ్బంది క‌లిగించే విష‌యం. 

2024 ఐపీఎల్‌కు గుజ‌రాత్ టైటాన్ స్క్వాడ్ ఇదే..
డేవిడ్ మిల్ల‌ర్‌, శుభ‌మాన్‌ గిల్ (కెప్టెన్), కేన్ విలియ‌మ్స‌న్‌, మాథ్యూ వేడ్‌, వృద్ధిమాన్ సాహా, సాయి సుద‌ర్శ‌న్‌, విజ‌య్ శంక‌ర్‌, షారూఖ్ ఖాన్, అభిన‌వ్ మ‌నోహార్‌, ద‌ర్శ‌న్ న‌ల‌కండే, జ‌యంత్ యాద‌వ్‌, రాహుల్ తేవాటియా, నూర్ అహ్మ‌ద్‌, సాయి కిశోర్‌, ర‌షీద్ ఖాన్, జాషువా లిటిల్‌, ఉమేష్ యాద‌వ్‌, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మాన‌వ్ సుత్రా, స్పెన్స‌ర్ జాన్స‌న్‌, రాబిన్ మింజ్‌, మోహిత్ శ‌ర్మ‌, అజ్మ‌తుల్లా ఓమ‌ర్‌జై.

More Telugu News