K Kavitha: లిక్కర్ స్కామ్‌లో అరెస్టు నేపథ్యంలో.. వైరల్ అవుతున్న కవిత పాత ఇంటర్వ్యూ వీడియో

BJP makes old video of kavitha go viral amidst her arrest in Delhi liquor scam
  • తాను సీఎం అయితే మద్యనిషేధం విధిస్తానని గత ఇంటర్వ్యూలో కవిత వ్యాఖ్య
  • నాటి వీడియోకు సంబంధించి ఎడిటెడ్ వర్షెన్‌ను నెట్టింట పంచుకున్న బీజేపీ
  • లిక్కర్ స్కామ్‌లో అరెస్టు నేపథ్యంలో వీడియో వైరల్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ నేత కవిత గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నాటి ఇంటర్వ్యూకు సంబంధించిన ఎడిటెడ్ వీడియోను బీజేపీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 

ఆ ఇంటర్వ్యూలో యాంకర్ కవితతో మాట్లాడుతూ.. ఒకవేళ మీరు సీఎం అయితే  కచ్చితంగా అమలు చేసే నిర్ణయం ఏమిటని ప్రశ్నించారు. దీనికి కవిత స్పందిస్తూ తాను లిక్కర్‌పై నిషేధం విధిస్తానని అన్నారు. ఇలా చేస్తే నష్టమొస్తుందని అంతా అంటారుగానీ తాను చేయగలిగితే మాత్రం మద్యంపై నిషేధం విధిస్తానని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో బీజేపీ ఈ వీడియోను నెట్టింట పంచుకుంది.
K Kavitha
BJP
Delhi Liquor Scam
Enforcement Directorate
BRS

More Telugu News