Communist Parties: ఎలక్టోరల్ బాండ్స్‌తో నిధులు స్వీకరించని మూడు పార్టీలు ఇవే!

  • ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు స్వీకరించని లెఫ్ట్ పార్టీలు
  • సుప్రీం ఆదేశాల మేరకు ఈసీ బహిరంగ పరిచిన ఎన్నికల బాండ్ల వివరాల్లో వెల్లడి
  • తాము తొలి నుంచీ ఎన్నికల బాండ్లను వ్యతిరేకించినట్టు ఈసీకి లేఖ రాసిన సీపీఐ(ఎమ్)
Three Left Parties Declared to EC That They Dont Accept Electoral Bonds

ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తాము నిధులు తీసుకోలేదని మూడు లెఫ్ట్ పార్టీలు సీసీఐ(ఎమ్), సీపీఐ, సీపీఐ(ఎమ్ఎల్) గతేడాదే ఈసీకి తెలియజేశాయి. ఈసీ తాజాగా బయటపెట్టిన వివరాల్లో ఈ విషయం వెల్లడైంది.

ఎలక్టోరల్ బాండ్స్‌కు తాము వ్యతిరేకమంటూ సీపీఐ(ఎమ్) ఈసీకి గతేడాది లేఖ రాసింది. ఎలక్టోరల్ బాండ్స్ ప్రకటించిన నాటి నుంచీ తాము ఈ స్కీమ్‌ను వ్యతిరేకించినట్టు సీపీఐ(ఎమ్) ఈసీకి తెలియజేసింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎటువంటి నిధులు స్వీకరించొద్దని తాము నిర్ణయించినట్టు తెలిపింది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. సుప్రీం కోర్టులో ఎలక్టోరల్ బాండ్స్‌ను వ్యతిరేకిస్తూ పెండింగ్‌లో ఉన్న మూడు పిటిషన్లలో ఒకటి తమదేనన్న విషయాన్ని కూడా సీపీఐ(ఎమ్) తన లేఖలో ప్రస్తావించింది. ఈ లేఖపై పార్టీ అధ్యక్షుడు సీతారాం ఏచూరి సంతకం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను బహిర్గతం చేసిన ఈసీ..ఈ లేఖను కూడా బయటపెట్టింది.

More Telugu News