Cheddy Gang: మియాపూర్‌లో చెడ్డీగ్యాంగ్.. స్కూల్‌లోకి చొరబడి రూ. 7.85 లక్షల చోరీ.. వీడియో ఇదిగో!

Cheddy Gang Robbed Rs 8 Lakhs From Miyapur World One School
  • వరల్డ్ వన్ స్కూల్‌లోకి చొరబడిన ఇద్దరు దొంగలు
  • సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
  • మియాపూర్ పరిసర ప్రాంత వాసుల్లో ఆందోళన
కొన్నాళ్ల క్రితం విజయవాడలో కలకలం సృష్టించిన కరుడుగట్టిన దొంగల ముఠా చెడ్డీగ్యాంగ్ ఆ తర్వాత మాయమైంది. గతేడాది ఆగస్టులో మియాపూర్ ప్రాంతంలో ఒకసారి వీరి కదలికలు కనిపించాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు హైదరాబాద్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చొరబడి లక్షల రూపాయల నగదు దోచుకుంది. స్కూల్‌లోని సీసీటీవీలో వారు దోచుకుంటున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

శనివారం రాత్రి వరల్డ్ వన్ స్కూల్‌లోకి ముసుగులు, చెడ్డీలతో చొరబడిన ఇద్దరు దొంగలు టేబుల్ సొరుగులో ఉన్న రూ. 7.85 లక్షలు దోచుకెళ్లారు. స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెడ్డీగ్యాంగ్ ముఠా హైదరాబాద్‌లో దిగిందన్న వార్తతో మియాపూర్ పరిసర ప్రాంత వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Cheddy Gang
Miyapur
Hyderabad
World One School

More Telugu News