Vladimir Putin: రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్

Vladimir Putin wins Russian Presidential election with 87 point 97per cent votes
  • 87.97 శాతం ఓట్లతో విజయం
  • పుతిన్‌పై పోటీకి దిగిన స్నేహపూర్వక పార్టీల అభ్యర్థులు
  • ఉక్రెయిన్ యుద్ధంపై, పుతిన్‌పై ఒక్క విమర్శ కూడా చేయని వైనం
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం ప్రారంభమై ఆదివారం వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయన 87.97 శాతం ఓట్లతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఆన్‌లైన్‌ ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. 60 శాతానికి మించి పోలింగ్ శాతం నమోదయింది. పుతిన్‌పై మూడు స్నేహపూర్వక పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీకి దిగారు. ఈ ముగ్గురు వ్యక్తులు గత 24 ఏళ్ల పుతిన్ పాలనపై, ఉక్రెయిన్‌ యుద్ధంపై చిన్న విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం.

అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధం, పుతిన్‌పై బహిరంగ విమర్శలు చేయకుండా ఆంక్షలు విధించారు. పుతిన్‌కు రాజకీయ శత్రువైన అలెక్సీ నవల్నీ గత నెలలో చనిపోయిన నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఇక పుతిన్‌ను విమర్శించిన వారిలో చాలా మంది జైలులో ఉండగా.. కొందరు విదేశాల్లో తలదాచుకుంటున్నారు.
Vladimir Putin
Russia
Russia Election
Ukraine war

More Telugu News