K Kavitha: కవిత తొలి రోజు ఈడీ విచారణ పూర్తి.. ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు

Kavitha ED questioning day 1 completed
  • విచారణను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు
  • ఆప్ కు ఇచ్చిన రూ. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న
  • కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్న కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలిరోజు ఈడీ విచారణ ముగిసింది. తొలి రోజే ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. ఆప్ కు ఇచ్చిన రూ. 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎవరెవరు డబ్బులు సమకూర్చారనే ఆధారాలను కూడా చూపిస్తూ ఆమెను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన రూ. 192 కోట్ల సంగతి ఏమిటని అడిగారు. డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారని ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు చెప్పిన కవిత... మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. 
K Kavitha
BRS
Enforcement Directorate

More Telugu News