Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఘనస్వాగతం పలుకుతున్నారు మోదీ గారూ!: చంద్రబాబు

Chandrababu responds to PM Modi tweet ahead of Praja Galam rally
  • బొప్పూడి వద్ద ప్రజాగళం సభ
  • ఏపీకి వస్తున్నా అంటూ మోదీ ట్వీట్
  • స్పందించిన చంద్రబాబు
  • సరికొత్త మైలురాళ్లు నెలకొల్పుదాం అంటూ పిలుపు
బొప్పూడి ప్రజాగళం సభకు బయల్దేరుతూ, "ఏపీకి వస్తున్నా" అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు ఘనస్వాగతం పలుకుతున్నారు మోదీ గారూ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. మనందరం కలిసి సంక్షేమం, అభివృద్ధి, ప్రభావవంతమైన పాలన దిశగా సరికొత్త మైలురాళ్లను నెలకొల్పుదాం అంటూ పిలుపునిచ్చారు. 

ఇక, చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ప్రజాగళం సభ వద్ద భారీ కోలాహలం నెలకొంది. మూడు పార్టీలకు చెందిన నేతలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ కూడా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బొప్పూడి రానున్నారు.
Chandrababu
Narendra Modi
Praja Galam
Boppudi
TDP
BJP
Janasena

More Telugu News