Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లపై వెబ్ సైట్ లో సమాచారాన్ని అప్ డేట్ చేసిన ఈసీ

  • ఎలక్టోరల్ బాండ్లపై పూర్తి సమాచారాన్ని ఈసీకి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
  • కోర్టు ఆదేశాలతో ఈసీకి డేటా అందించిన ఎస్బీఐ
  • ఎలక్టోరల్ బాండ్లపై కొత్త సమాచారాన్ని వెబ్ సైట్లో పెట్టిన ఈసీ
EC updates website with new data on electoral bonds

ఎలక్టోరల్ బాండ్లపై తాము ఆదేశించిన మేరకు సమాచారాన్ని బహిర్గతం చేయడంలో ఎస్బీఐ విఫలమైందని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్లపై ఎన్నికల సంఘానికి పూర్తి సమాచారం అందించాలని సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు పంపింది. ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లు లేవని, దాంతో ఆ బాండ్లు ఎవరికి ఇచ్చారన్న దానిపై స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 

ఈ నేపథ్యంలో, ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్లపై తాజా సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందించింది. దాంతో, ఈసీ తన వెబ్ సైట్ లో ఎలక్టోరల్ బాండ్ల డేటాను తాజాగా ఎస్బీఐ అందించిన సమాచారంతో అప్ డేట్ చేసింది. ఎస్బీఐ సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించిన వివరాలను కూడా వెబ్ సెట్లో పెట్టారు. ఈ మేరకు ఈసీ ఓ ప్రకటన చేసింది.

More Telugu News