Revanth Reddy: గతంలో తొడగొట్టి రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైనవి: మల్లారెడ్డి

all comments i made on Revanth reddy are purely political says MLA Mallareddy
  • రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది తానేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • టీడీపీలో ఉన్నప్పుడు స్నేహంగా ఉండేవాళ్లమన్న మల్లారెడ్డి
  • పార్టీ మారేది లేదని వెల్లడి
గతంలో రేవంత్‌ రెడ్డిపై తొడగొట్టి తాను చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైనవని, వ్యక్తిగతంగా కాదని మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తామంతా ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది తానేనని మాల్లారెడ్డి అన్నారు. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే సాయన్న 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో ఈ విషయాన్ని తాను రేవంత్‌రెడ్డితో చెప్పానని మల్లారెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కంటోన్మెంట్‌ జయానగర్‌ కాలనీలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో విడుదల చేశారు.

కాగా తాను వేరే పార్టీలో చేరేది లేదని ఈ సందర్భంగా మల్లారెడ్డి అన్నారు. తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
Revanth Reddy
Mallareddy
Lok Sabha Polls
Congress
BRS

More Telugu News