Kim Jong Un: పుతిన్ గిఫ్ట్ గా ఇచ్చిన కారులో కిమ్ షికార్లు

  • గతేడాది సెప్టెంబరులో రష్యాలో పర్యటించిన ఉత్తర కొరియా అధినేత
  • విలాసవంతమైన ఆరస్ లిమోసిన్ కారును కానుకగా ఇచ్చిన పుతిన్
  • మరింత బలపడుతున్న రష్యా, ఉత్తర కొరియా మైత్రి 
Kim Jong Un rides in Putin gifted car

ఉక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన రష్యా... అణుశక్తిగా ఎదిగి ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్న ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం ఏర్పడడంలో ఆశ్చర్యమేమీ లేదు. 

ఈ రెండు దేశాలకు ఉమ్మడి ప్రబల శత్రువు అమెరికా. అమెరికాతో వైరం ముదిరేకొద్దీ రష్యా, ఉత్తర కొరియా మధ్య మైత్రి కూడా అంతకంతకు బలపడుతోంది. అందుకు నిదర్శనంగా... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కు ఓ ఖరీదైన కారును బహూకరించారు. ఇప్పుడా కారులో కిమ్ దర్జాగా షికార్లు కొడుతున్నారు.

గతేడాది సెప్టెంబరులో కిమ్ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పటిష్ఠమైన సైనిక సంబంధాల కోసం ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా పుతిన్ రష్యా తయారీ ఆరస్ సెనాట్ ఫుల్ సైజ్ లగ్జరీ లిమోసిన్ కారును కిమ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. నిన్న ఈ కారులో షికార్లు కొడుతూ కిమ్ పబ్లిగ్గా దర్శనమిచ్చారు.

More Telugu News