K Kavitha: కవిత కేసు విషయంలో... ఢిల్లీలో అడ్వొకేట్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్న కేసీఆర్

KCR will monitoring kavitha arrest issue
  • సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు  
  • ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతోనూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధిష్ఠానం
  • కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు ఢిల్లీలోనే అడ్వొకేట్ల   టీమ్
తన కూతురు, ఎమ్మెల్సీ కవితను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. కవిత కోసం ఢిల్లీ అడ్వొకేట్ టీమ్‌ను కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతోనూ మాట్లాడుతున్నారు. కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

ఈడీ రేపటి నుంచి కవితను ఏడు రోజుల పాటు విచారించనుంది. ఈ నేపథ్యంలో సోమా భరత్ ఆధ్వర్యంలో అడ్వొకేట్ టీమ్ ఆమెకు అందుబాటులో ఉండనున్నారు. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు... ఆమె చెప్పే సమాధానాలపై వారు సూచనలు ఇవ్వనున్నారు. కవిత కస్టడీలో ఉన్నప్పుడు రోజూ గంటసేపు ములాఖత్ ఉంటుంది. ఈ ములాఖత్ సమయంలో న్యాయవాదుల టీమ్ అందుబాటులో ఉండి సూచనలు చేస్తుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు వారు అక్కడే ఆమెకు అందుబాటులో ఉంటారు.
K Kavitha
BRS
Telangana

More Telugu News