KCR: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో కేసీఆర్ విగ్ర‌హాల త‌యారీ.. నెటిజ‌న్ల స్పంద‌న ఇదీ!

Making of KCR Idols in East Godavari District
  • కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాల త‌యారీ
  • సామాజిక మాధ్య‌మాల్లో ఫొటోల వైర‌ల్
  • త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్న నెటిజన్లు
బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణలోని అభిమాన‌గ‌ణం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే అభిమానులు పోస్ట్ చేశారో లేక తయారీదారులు పోస్ట్ చేశారో తెలీదు కానీ.. ప్రస్తుతం కేసీఆర్ విగ్రహాల త‌యారీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట‌ బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో కొత్తేమి ఉంద‌నేగా మీ అనుమానం. ఆ విగ్ర‌హాలు తెలంగాణ‌లో త‌యార‌యితే ప‌ర్లేదు. కానీ, అవి త‌యారవుతుంది ప‌క్క రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో. అందుకే వాటి తాలూకు ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలను తయారు చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక కేసీఆర్ విగ్రహాలకు సంబంధించిన ఫొటోలను చూసిన నెటిజన్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.  
KCR
KCR Idols
East Godavari District
Andhra Pradesh

More Telugu News