Akhilesh Yadav: ఎమ్మెల్సీ కవితకు యూపీ మాజీ సీఎం మద్దతు

UttarPradesh Former CM Akhilesh Yadav Tweet On MLC Kavitha Arrest
  • ట్విట్టర్ లో మద్దతుగా నిలిచిన అఖిలేశ్ యాదవ్
  • ఓటమి భయంతోనే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ
  • ఎన్ని దాడులు చేస్తే బీజేపీ అన్ని సీట్లలో ఓడిపోతుందన్న ఎస్పీ చీఫ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టును యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖండించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ట్విట్టర్ వేదికగా ఆయన ఆరోపించారు. అందుకే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. అయితే, ప్రతిపక్ష నేతలపై ఎంతగా దాడులు చేస్తుంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అంతే పెద్ద మొత్తంలో సీట్లను కోల్పోతుందని చెప్పారు.

ప్రతిపక్షాలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ట్వీట్ చేస్తూ యూపీ మాజీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు అక్రమమని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు అఖిలేశ్ యాదవ్ తన ట్వీట్ ను బీఆర్ఎస్ పార్టీ, కవిత, కవిత ఆఫీస్ అకౌంట్లకు ట్యాగ్ చేశారు.
Akhilesh Yadav
MLC Kavitha
Kavitha Arrest
SP Chief
Twitter

More Telugu News