Kavitha Arrest congress: బీఆర్ఎస్ ను బతికించేందుకే కవిత అరెస్టు డ్రామా: కాంగ్రెస్ నేత నిరంజన్

  • బీజేపీ, బీఆర్ఎస్ ఉమ్మడిగా తెరతీసిన నాటకమని విమర్శ
  • ఎన్నికల టైమ్ లో అరెస్టు చేయడం సానుభూతి కోసమేనని వ్యాఖ్య 
  • బీజేపీ తీరుపై మండిపడ్డ పీసీసీ వైస్ ప్రెసిడెంట్
Telangana PCC Vice President Niranjan Reaction On Kavitha Arrest

తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ నేత, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ చెప్పారు. కొన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ ను బతికించేందుకు బీజేపీ కొత్త డ్రామాకు తెరతీసిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు.. బీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడిగా ఆడుతున్న నాటకమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పై ప్రజల్లో సానుభూతి పెంచేందుకే ఈ కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు.

ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఈడీ అధికారులు.. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందురోజు వచ్చి హడావుడిగా అరెస్టు చేసి తీసుకెళ్లడం ఎన్నికల స్టంట్ తప్ప మరొకటి కాదని నిరంజన్ విమర్శించారు. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజిగిరిలో రోడ్ షో చేస్తుంటే, మరోవైపు కవిత అరెస్టు పేరుతో ఇరు పార్టీలు డ్రామా చేశాయని మండిపడ్డారు.

More Telugu News