Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్ మార్పు

CM Revanth Reddy number plate changed
  • టీఎస్ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్లను తొలగించిన సెక్యూరిటీ సిబ్బంది 
  • టీజీ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్లను వాహనాలకు పెట్టిన సెక్యూరిటీ 
  • ఈ రోజు నుంచి టీజీ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాల నెంబరు ప్లేట్లు మారాయి. టీఎస్ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్లను సెక్యూరిటీ సిబ్బంది తొలగించి టీజీ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్లను వాహనాలకు పెట్టారు. తెలంగాణలో ఈ రోజు నుంచి వాహనాల నెంబర్ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్ల వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు చేపట్టిందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు మొదలు సామాన్య ప్రజలు టీజీ పేరును ఉపయోగించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఎస్ స్థానంలో టీజీని మార్చింది.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News