K Kavitha: కవిత ఇంట్లో ఈడీ సోదాల నేపథ్యంలో నేతలతో కేసీఆర్ భేటీ

KCR meeting with ktr harish rao after ed raids on kavitha residence
  • కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్‌లతో సమావేశమైన కేసీఆర్
  • కవిత ఇంట్లో సోదాలపై ఆరా తీసిన బీఆర్ఎస్ అధినేత
  • మూడు నాలుగు గంటలుగా కవిత నివాసంలో ఈడీ అధికారుల సోదాలు
తన కూతురు, ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలువురితో ఆకస్మిక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌లతో హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసంలో ఆయన భేటీ అయ్యారు. కవిత ఇంటి వద్ద ఈడీ సోదాలు, స్టేట్‌మెంట్ రికార్డ్ తదితర అంశాలపై ఆరా తీశారు. ఈడీ అధికారులు మూడు నాలుగు గంటలుగా కవిత నివాసంలోనే ఉన్నారు. అధికారులు వచ్చినప్పుడు కవిత, ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉన్నారు.
K Kavitha
BRS
Congress
KCR

More Telugu News